Achennaidu: అచ్చెన్నాయుడిని ఎందుకు గెలిపించామా అని టెక్కలి ప్రజలు బాధపడుతున్నారు: పేర్ని నాని

  • పేర్ని నాని వ్యాఖ్యలపై శాసనసభలో దుమారం
  • పేర్ని నాని వ్యాఖ్యలు అభ్యంతరకరమన్న అచ్చెన్న
  • స్పీకర్ ను బెదిరించేలా అచ్చెన్నాయుడు వ్యవహరిస్తున్నారన్న శ్రీకాంత్ రెడ్డి

ఏపీ శాసనసభ సమావేశాల సందర్భంగా మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు సభలో దుమారాన్ని రేపాయి. టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, అచ్చెన్నాయుడిని ఎందుకు గెలిపించామా అని టెక్కలి నియోజకవర్గ ప్రజలు బాధపడుతున్నారని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ అభ్యంతరం తెలిపింది. అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, సభలో తాను ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదని చెప్పారు. పేర్ని నాని వ్యాఖ్యలు అభ్యంతరకరమని అన్నారు. దీనికి సమాధానంగా తాను చేసిన వ్యాఖ్యలు తప్పని తేలితే, వెనక్కి తీసుకుంటానని పేర్ని నాని అన్నారు.

ఇదే సందర్భంగా చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, సభా సంప్రదాయాలను అచ్చెన్నాయుడు మర్చిపోయారని విమర్శించారు. సాక్షాత్తు స్పీకర్ ను బెదిరించేలా ఆయన వ్యవహరిస్తున్నారని అన్నారు.

Achennaidu
Perni Nani
Srikath Reddy
Telugudesam
YSRCP
Assembly
  • Loading...

More Telugu News