Rajinikanth: రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిది: టీఎన్‌సీసీ చీఫ్ కేఎస్ అళగిరి

  • సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు
  • ఎంజీఆర్ తప్ప మరెవరూ రాణించలేదు
  • రజనీకాంత్ అనవసర ప్రయత్నాలు మానుకోవాలి

రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనను రజనీకాంత్ విరమించుకోవడం మంచిదని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి హితవు పలికారు. ఒక్క ఎంజీఆర్ తప్ప సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చిన వారెవరూ రాణించలేదని ఆయన గుర్తు చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వేలూరు ఎన్డీయే అభ్యర్థి ఏసీ షణ్ముగానికి మద్దతుగా రజనీ మక్కల్ మండ్రం సభ్యులు ప్రచారం చేసిన విషయమై అళగిరి వద్ద విలేకరులు ప్రస్తావించగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

వేలూరులో సినిమా థియేటర్లు ఎక్కువగా ఉన్నాయని, ఇక్కడ రజనీకాంత్ సినిమాలు వేస్తే అభిమానులు చూస్తారని అన్నారు. కానీ ఎన్నికల్లో మాత్రం వారి ప్రభావం నామమాత్రమేనని తేల్చి చెప్పారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రజనీకాంత్ అర్థం చేసుకుని రాజకీయాల్లోకి రావాలన్న ప్రయత్నాలు మానుకోవడం మంచిదని అళగిరి హితవు పలికారు.

Rajinikanth
Tamil Nadu
politics
vellore
Azhagiri
  • Loading...

More Telugu News