APIIC: ప్రభుత్వానికి, జగన్ కు మంచి పేరు తీసుకొస్తా: ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా

  • ఎక్కువ సంఖ్యలో మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తా
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్ద పీట వేస్తాం
  • జగన్ పాలనలా ఏపీఐఐసీ కూడా పారదర్శకంగా ఉంటుంది

మహిళా పారిశ్రామికవేత్తలు ఎక్కువ సంఖ్యలో తయారయ్యేలా తన వంతు కృషి చేస్తానని ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా అన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, ముఖ్యంగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ ఎలాగైతే పెద్ద పీట వేస్తున్నారో, అలాగే, ఏపీఐఐసీ ద్వారా కూడా చేస్తానని, వాళ్లను కూడా ముందుకు తీసుకెళ్లేందుకు పాటుపడతానని చెప్పారు.

 గత ప్రభుత్వం అడ్డదిడ్డంగా కేటాయింపులు చేసిందని, పెట్టుబడుల విషయంలో కూడా అన్నీ కాకిలెక్కలు చెప్పిందని విమర్శించారు. గత ప్రభుత్వం ఏఏ పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పించిందో సరైన లెక్కలు లేవని, కేవలం, మీడియా ద్వారా ప్రజలను డైవర్ట్ చేయాలని చూశారే తప్ప, పారదర్శకంగా వ్యవహరించలేదని విమర్శించారు. జగన్ పాలన ఎంత పారదర్శకంగా, అవినీతి రహితంగా ఉంటుందో అదే విధంగా ఏపీఐఐసీ కూడా ఉంటుందని స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి తనను నమ్మి ఈ బాధ్యతను తనకు అప్పగించినందుకు ఆయనకు, తమ ప్రభుత్వానికి మంచిపేరు తెస్తానని అన్నారు. 

APIIC
chairperson
mla
Roja
cm
jagan
  • Loading...

More Telugu News