Hema Malini: హేమమాలిని సినిమాల్లో మాత్రమే చీపురు పడుతుంది: ధర్మేంద్ర చురక

  • చీపురు పట్టడంలో స్పెషలిస్టునని వెల్లడి
  • శుభ్రతను చాలా ఇష్ట పడతానన్న ధర్మేంద్ర
  • ధర్మేంద్రపై ప్రశంసల జల్లు కురిపిస్తున్న నెటిజన్లు

సినీ నటి, మధుర ఎంపీ హేమమాలిని ఇటీవల చీపురు పట్టి పార్లమెంట్ ఆవరణను శుభ్రం చేయడమేమో కానీ అది పలు చర్చలకు దారి తీస్తోంది. ఆమె చీపురు పట్టి మీడియా ఎదుట పోజిచ్చారా? లేదంటే ఇంట్లో కూడా చీపురు పడుతుంటారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇదే విషయమై ఆమె భర్త ధర్మేంద్రను ఓ నెటిజన్ ప్రశ్నించగా, ఆయన అసలు విషయాన్ని వెల్లడించారు.

సినిమాల్లో మాత్రమే హేమమాలిని చీపురు పడుతుందని ధర్మేంద్ర నిజాయతీగా ఒప్పుకున్నారు. తాను మాత్రం చీపురు పట్టి శుభ్రం చేయడంలో నిపుణుడినని, శుభ్రతను చాలా ఇష్టపడతానని అన్నారు. ఇంత నిజాయతీగా సమాధానమిచ్చిన ధర్మేంద్రపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరోపక్క, ధర్మేంద్ర చెప్పిన సమాధానంపై హేమమాలిని ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తారోనంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Hema Malini
Dharmendra
Parliament
Movies
Netizens
Setires
  • Loading...

More Telugu News