Revanth Reddy: రికార్డులు మాయమైతే ఎవరు బాధ్యులు?: రేవంత్ రెడ్డి
- మూఢ నమ్మకాల కారణంగానే కూల్చివేత
- కూల్చివేతల వల్ల ప్రజలపై భారం పడుతుంది
- గవర్నర్ స్పందించకుంటే సుప్రీంను ఆశ్రయిస్తాం
సచివాలయ భవనాలను మూఢ నమ్మకాల కారణంగా కూల్చుతున్నారని, భవనాల తరలింపు కారణంగా ఏవైనా రికార్డులు మాయమైతే బాధ్యులెవరని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. భవనాలను కూల్చి నూతన భవనాలు నిర్మించడం కారణంగా ప్రజలపై భారం పడుతుందని పేర్కొన్నారు. భవనాల కూల్చివేతపై గవర్నర్ స్పందించకుంటే సుప్రీంను ఆశ్రయించడానికి సైతం వెనుకాడబోమన్నారు.
సచివాలయ భవనాల కూల్చివేతను తక్షణమే ఆపాలని మాజీ ఎంపీ వివేక్, టీడీపీ నేత ఎల్. రమణ డిమాండ్ చేశారు. విద్య, వైద్య రంగాలను గాలికొదిలేసిన సీఎం కేసీఆర్, ఇప్పుడు కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణంపై పడ్డారని బీజేపీ నేత డీకే అరుణ ఆరోపించారు. కూల్చివేతల విషయంలో తక్షిణమే గవర్నర్ స్పందించాలని టీజేఎస్ అధినేత కోదండరాం కోరారు.