Geeta Singh: ఆ అవమానానికి లొకేషన్ లోనే ఏడ్చేశాను: హాస్యనటి గీతాసింగ్

  • పరభాషా నటులకు ప్రాధాన్యతనిస్తున్నారు 
  • ఇక్కడి వాళ్లకు అవకాశాలు ఇవ్వడం లేదు
  •  తనకు అవమానంగా అనిపించిందన్న గీతా సింగ్   

తెలుగు తెరపై హాస్యనటిగా గీతా సింగ్ కి ప్రత్యేకమైన గుర్తింపు వుంది. హాస్యనటిగా మంచి మార్కులు కొట్టేసిన ఆమె, తాజా ఇంటర్వ్యూలో తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "తెలుగులో ఎంతోమంది మంచి నటీనటులు వున్నారు. అయినా ఇక్కడివారికి అవకాశం ఇవ్వకుండా, పరభాషా నటీనటులను దిగుమతి చేసుకుంటున్నారు. వాళ్ల రాకపోకలకు .. హోటల్లో బస చేయడానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు.

ఇటీవల ఒక ప్రొడక్షన్ వాళ్లు తమ సినిమా కోసం నా డేట్స్ అడిగితే ఇచ్చాను. వాళ్లకి ఇచ్చిన డేట్స్ ప్రకారం లొకేషన్ కి వెళ్లాను. అక్కడ ఒక అమ్మాయితో కొన్ని సీన్స్ చేస్తున్నారు. నాకు బదులుగా ఆ అమ్మాయిని తీసుకున్నట్టుగా చెప్పారు. నాకు చాలా అవమానంగా అనిపించేసి అక్కడే ఏడ్చేశాను" అని చెప్పుకొచ్చారు. 

Geeta Singh
  • Loading...

More Telugu News