Yuvraj Singh: ఐసీసీ బౌండ్రీ రూల్ పై మండిపడ్డ యువరాజ్ సింగ్

  • ఐసీసీ బౌండ్రీ రూల్ పై సర్వత్ర విమర్శలు
  • ఈ రూల్ తో తాను ఏకీభవించనన్న యువరాజ్
  • న్యూజిలాండ్ ఎంతో ఆకట్టుకుంది

ప్రపంచకప్ ఫైనల్స్ ఫలితంపై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. సూపర్ ఓవర్ లో కూడా రన్స్ సమానంగా రావడంతో మ్యాచ్ లోను, సూపర్ ఓవర్లోనూ లో ఎక్కువ బౌండరీలు కొట్టిన జట్టును విజేతగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ బౌండ్రీ రూల్ పై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నారు.

ట్విట్టర్ ద్వారా యువరాజ్ సింగ్ స్పందిస్తూ... ఈ రూల్ తో తాను ఏకీభవించనని స్పష్టం చేశాడు. అయితే, రూల్స్ రూల్సేనని చెప్పాడు. ప్రపంచకప్ ను సాధించిన ఇంగ్లండ్ కు శుభాకాంక్షలు తెలిపాడు. చివరి క్షణం వరకు విజయం కోసం వీరోచితంగా పోరాడిన న్యూజిలాండ్ ఎంతో ఆకట్టుకుందని చెప్పాడు. ఇదొక అద్భుతమైన ఫైనల్స్ అని కితాబిచ్చాడు.

Yuvraj Singh
ICC
Boundry Rule
  • Loading...

More Telugu News