Chandrababu: చంద్రబాబు చేసిందేమీలేదు.. పోలవరంకు అన్ని అనుమతులు తీసుకొచ్చింది వైయస్సారే: అనిల్ కుమార్ యాదవ్

  • శంకుస్థాపనలు, ఫొటోలు దిగడం తప్ప చంద్రబాబు ఏమీ చేయలేదు
  • జనాలను తీసుకెళ్లి భజన చేయించుకున్నారు
  • భూనిర్వాసితులకు న్యాయం చేయాలని జగన్ చెప్పారు

పోలవరం ప్రాజెక్టు వద్ద శంకుస్థాపనలు, ఫొటోలు దిగడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు వద్దకు జనాలను తీసుకెళ్లి భజన చేయించుకున్నారని విమర్శించారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పిన నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు.

పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకొచ్చింది రాజశేఖరరెడ్డేనని అనిల్ చెప్పారు. వైయస్ హయాంలో కాలువలు తవ్వారని... అప్పుడు తవ్వకపోయి ఉంటే భూసేకరణకు వేల కోట్ల రూపాయల భారం పడేదని తెలిపారు. భూనిర్వాసితులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని అన్నారు.

Chandrababu
YSR
Jagan
Polavaram
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News