Anantapur District: అనంత పోలీసన్న సరదా... స్టేషన్లో అర్ధనగ్నంగా, దర్జాగా..!

  • స్టేషన్ కు ప్యాంట్ లేకుండా వచ్చిన కానిస్టేబుల్
  • రహస్యంగా ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిన యువకులు
  • విషయం ఉన్నతాధికారుల దృష్టికి

 ఎంతో బాధ్యతగా ఉండాల్సిన ఓ కానిస్టేబుల్‌, తాను విధులు నిర్వహించాల్సిన పోలీస్ స్టేషన్ కు అర్ధనగ్నంగా రావడం, ఏఎస్ఐ, సిబ్బంది చూసి కూడా ఏమీ అనకుండా మిన్నకుండిపోవడం, విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం జరిగింది. ఈ ఘటన నిన్న అనంతపురం రూరల్‌ మండల పరిధిలోని ఇటుకలపల్లి పోలీసు స్టేషన్‌ లో జరిగింది.

ఇక్కడ విధులు నిర్వహించే కానిస్టేబుల్‌ సుధాకర్‌, ఒంటిపై యూనిఫారం కాకుండా సాధారణ చొక్కా, డ్రాయర్‌ తో స్టేషన్‌ కు వచ్చాడు. స్టేషన్ లో దర్జాగా తిరిగాడు. కుర్చీలో కూర్చుని బాతాఖానీ పెట్టాడు. దీన్ని చూసిన కొందరు రహస్యంగా ఫొటోలు తీసి వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో అవి వైరల్ అయి, జిల్లా హెడ్ క్వార్టర్స్ వరకూ వెళ్లాయి. ఇక ఉన్నతాధికారులు అతనిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారన్న విషయం ఇంకా తెలియరాలేదు.

Anantapur District
Police
Station
Half Nude
  • Loading...

More Telugu News