Kabir Singh: కబీర్ సింగ్ సినిమా చూస్తే నాకేం వస్తుంది: విజయ్ దేవరకొండ

  • డియర్ కామ్రేడ్ ప్రచార కార్యక్రమాల్లో విజయ్ దేవరకొండ బిజీ
  • కబీర్ సింగ్ గురించి ప్రశ్నించిన విలేకరులు
  • తెలుగులో ఆ సినిమా చేసింది తానే అని చెప్పిన విజయ్ దేవరకొండ

యువ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ ను మలుపుతిప్పిన చిత్రం అంటే అర్జున్ రెడ్డి అనే చెప్పాలి. టాలీవుడ్ లో అదో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయింది. ఇప్పుడా చిత్రం హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ అయింది. హిందీ వెర్షన్ లో షాహిద్ కపూర్ ప్రధానపాత్రలో నటించాడు. అయితే, డియర్ కామ్రేడ్ ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండను మీడియా ప్రతినిధులు కబీర్ సింగ్ చిత్రం గురించి అడిగారు. కబీర్ సింగ్ మాతృక అర్జున్ రెడ్డిలో నటించింది తానే అయినప్పుడు కబీర్ సింగ్ సినిమా చూడడం వల్ల తనకేమీ ఉపయోగం ఉండదని అభిప్రాయపడ్డాడు. ఆ సినిమా కథంతా తనకు తెలుసు కాబట్టి, మళ్లీ చూడాల్సిన అవసరంలేదన్నాడు. కబీర్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్ జీవించి ఉంటాడని విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు.

Kabir Singh
Vijay Devarakonda
Arjun Reddy
Tollywood
  • Loading...

More Telugu News