prakasam: ప్రకాశం జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లిన విద్యార్థుల్లో ఒకరు గల్లంతు!

  • రామాపురంలో సంఘటన
  • సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు విద్యార్థులు
  • ఒకరిని కాపాడిన స్థానికులు..అతని పరిస్థితి విషమం

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామాపురంలో విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానం చేసేందుకని నలుగురు ఇంటర్ విద్యార్థులు అక్కడికి వెళ్లారు. అయితే, సముద్ర కెరటాల తాకిడికి యువకుడు జస్వంత్ గల్లంతయ్యాడు. మరో యువకుడు సూర్య సంజయ్ ని స్థానికులు కాపాడారు. సూర్య సంజయ్ ను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కాగా, ఈ నలుగురు విద్యార్థులు గుంటూరులోని మాస్టర్ మైండ్స్ కళాశాలలో చదువుకున్నట్టు తెలుస్తోంది.  

prakasam
vetapalem
Ramapuram
youth
  • Loading...

More Telugu News