Andhra Pradesh: జగన్ ను కూడా ప్రజలు ఇంటికి సాగనంపుతారు: శివరాజ్ సింగ్ చౌహాన్

  • చంద్రబాబు పాలనలానే జగన్ పాలన ఉంది
  • ఏపీ రాజకీయాల్లో కుటుంబం, ఒక కులానికే ప్రాధాన్యత  
  • బీజేపీలో వీటికి స్థానం లేదు

ఏపీ సీఎం జగన్ పై బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర విమర్శలు చేశారు. మాజీ సీఎం చంద్రబాబు పాలనలానే జగన్ పాలన ఉందని విమర్శించారు. ఏపీ రాజకీయాల్లో కుటుంబం, ఒక కులానికే ప్రాధాన్యత ఇస్తారని విమర్శించారు. బీజేపీలో కుల, మత, కుటుంబ రాజకీయాలకు స్థానం లేదని అన్నారు. లోకేశ్ ను సీఎంగా చూడాలని చంద్రబాబు ముందుకు సాగుతున్నారని జోస్యం చెప్పారు. మోదీ, బీజేపీని తిట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని, బాబుకు ప్రజలు తగినబుద్ధి చెప్పారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోదీ పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, బీజేపీలో చేరేందుకు అనేక మంది నేతలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

Andhra Pradesh
cm
jagan
shivaraj singh
chohan
bjp
Chandrababu
Telugudesam
ex-cm
  • Loading...

More Telugu News