Karnataka: రెబల్ ఎమ్మెల్యేల డిమాండ్లు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం: కర్ణాటక మంత్రి డీకే శివకుమార్

  • మా ఎమ్మెల్యేలపై మాకు పూర్తి విశ్వాసం ఉంది
  • ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో సమస్యలపై పులుల్లా పోరాడారు
  • బలపరీక్షవేళ పార్టీ వ్యతిరేక ఓటు వేయకూడదని చట్టంలో ఉంది

రెబల్ ఎమ్మెల్యేల డిమాండ్లు నెరవేర్చడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శివకుమార్  అన్నారు. ప్రభుత్వాన్ని కాపాడే దిశగా రెబల్ ఎమ్మెల్యేల నుంచి తమకు సంకేతాలు అందుతున్నాయని చెప్పారు.

తమ ఎమ్మెల్యేలపై తమకు పూర్తి విశ్వాసం ఉందని శివకుమార్ మరోసారి స్పష్టం చేశారు. పార్టీతో తమ ఎమ్మెల్యేలు సుదీర్ఘకాలంగా అనుబంధం కలిగి ఉన్నారని, ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో సమస్యలపై పులుల్లా పోరాడారని ప్రశంసించారు. బలపరీక్షవేళ పార్టీ వ్యతిరేక ఓటు వేయకూడదని చట్టంలో ఉందని, వ్యతిరేకంగా ఓటు వేస్తే సభ్యత్వం కోల్పోతారని వారికి తెలుసని అన్నారు. 

Karnataka
congress
jds
minister
shivakumar
  • Loading...

More Telugu News