Karnataka: కర్ణాటకలో కొనసాగుతున్న సంక్షోభం.. మాటమార్చిన మంత్రి నాగరాజు!

  • రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు ముంబైకు నాగరాజు
  • ప్రభుత్వానికి సహకరిస్తానని చెప్పి మాట తప్పిన వైనం
  • ప్రస్తుత పరిణామాలపై దేవెగౌడ, కుమారస్వామి చర్చ

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు మంత్రి ఎంటీబీ నాగరాజు కొద్ది సేపటి క్రితం ముంబై బయలుదేరారు. నిన్న నాగరాజుతో సీఎం కుమారస్వామి  చర్చలు జరిపారు. సంకీర్ణ ప్రభుత్వానికి సహకరిస్తామని కుమారస్వామితో నాగరాజు చెప్పినట్టు సమాచారం. ఇరవై నాల్గు గంటలు గడవకముందే నాగరాజు మాట మార్చాడు.

నాగరాజు నిర్ణయంతో రెబల్ ఎమ్మెల్యేల శిబిరంలోకి మరో ఎమ్మెల్యే సుధాకర్ కూడా వెళతారని తెలుస్తోంది. కాగా, జేడీఎస్ అధినేత, తన తండ్రి దేవెగౌడ నివాసానికి సీఎం కుమారస్వామి చేరుకున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వారు చర్చిస్తున్నట్టు సమాచారం.

Karnataka
Deve gowda
minister
Nagaraju
JDS
  • Loading...

More Telugu News