suicide: పంజాబ్‌ ఎల్‌పీ యూనివర్సిటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య

  • మృతుడు అనంతపురం జిల్లా వాసి
  • బీటెక్‌ చదువుతున్న భరత్‌
  • హాస్టల్‌ భవనం పైనుంచి దూకి బలవన్మరణం

పంజాబ్‌ రాష్ట్రంలోని జలంధర్‌కు సమీపంలో ఉన్న లవ్లీ ఫ్రొఫెషనల్‌ యూనివర్సిటీ (ఎల్‌పీయూ)లో చదువుతున్న తెలుగు విద్యార్థి ఒకరు ఈరోజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతపురం జిల్లాలోని గుడిపాడుకు చెందిన భరత్‌ యూనివర్సిటీలో బీటెక్‌ చదువుతున్నాడు. ఈరోజు ఉదయం ఇతను తాను ఉంటున్న హాస్టల్‌ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికంగా ఈ ఘటన విద్యార్థుల్లో కలకలాన్ని రేపింది. యూనివర్సిటీ యాజమాన్యం భరత్‌ కుటుంబానికి ఆత్మహత్యపై సమాచారం అందించింది. అయితే భరత్‌ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.

suicide
punjab
LPU
BTech student
  • Loading...

More Telugu News