Ravindranath Reddy: టీడీపీది అంకెల గారడీ.. వైసీపీది ప్రజామోదమైన బడ్జెట్: వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి

  • మజ్దూర్ యూనియన్ తరుఫున జగన్‌కు ధన్యవాదాలు
  • ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తాననడం హర్షణీయం
  • గత ప్రభుత్వం ఆర్టీసీని అప్పులోకి నెట్టేసింది

గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ అయితే.. వైసీపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజామోదమైందని సీఎం జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆర్టీసీకి కేటాయించిన బడ్జెట్‌పై జగన్‌కు మజ్దూర్ యూనియన్ తరుఫున ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీని విలీనం చేస్తాననడం హర్షించదగిన పరిణామమన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని అప్పులోకి నెట్టేయడమే కాకుండా ప్రైవేటు పరం చేయాలని చూసిందని రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. కొత్త బస్సుల కొనుగోలు ద్వారా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.

Ravindranath Reddy
Jagan
Chandrababu
APSRTC
Budget
  • Loading...

More Telugu News