TTD: శ్రీవారి బూందీ పోటులో అగ్ని ప్రమాదాల నివారణకు టీటీడీ కీలక నిర్ణయం

  • పెద్ద మొత్తంలో లడ్డూ తయారీ
  • శ్రీవారి బూందీపోటులో తరచూ అగ్ని ప్రమాదాలు
  •  థెర్మో ఫ్లూయిడ్ స్టౌవ్‌లను పరిశీలిస్తున్న టీటీడీ

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పెద్ద మొత్తంలో ప్రసాదం తయారీ కారణంగా నెయ్యి కూడా పెద్ద మొత్తంలోనే వాడుతుంటారు. దీంతో శ్రీవారిలో బూందీ పోటులో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో టీటీడీ బూందీ పోటు ఆధునికీకరణకు నడుం బిగించింది. దీనికోసం థెర్మో ఫ్లూయిడ్ ద్వారా నడిచే స్టౌవ్‌లను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స్టౌవ్‌ల ద్వారా మంటలు వెలుపలికి వచ్చే అవకాశం లేదు. వేడి కూడా బయటకు రాదు. దీంతో సిబ్బందికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని టీటీడీ అధికారులు థెర్మో ఫ్లూయిడ్ స్టౌవ్‌లను పరిశీలిస్తున్నారు.  

TTD
Ghee
Laddu
Fire Accident
Turmo Fuid
Stove
  • Loading...

More Telugu News