Andhra Pradesh: నందమూరి బాలకృష్ణ ఓ ‘త్రీడీ’!: కోడెల శివప్రసాద్ ప్రశంసలు

  • బాలకృష్ణ త్రీడీలా ఉన్నారు
  • వైద్యులు ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుండాలి
  • హైదరాబాద్ లో మాట్లాడిన టీడీపీ సీనియర్ నేత

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివప్రసాద్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ప్రశంసలు కురిపించారు. నందమూరి బాలకృష్ణ ‘త్రీడీ’లా ఉన్నారని వ్యాఖ్యానించారు. నటన, సేవా కార్యక్రమాలు, రాజకీయాల్లో బాలయ్య ఏకకాలంలో రాణిస్తున్నారని కితాబిచ్చారు. హైదరాబాద్ లోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో బాలకృష్ణ ‘త్రీడీ మమ్మోగ్రఫి’ యంత్రం ఆవిష్కరణ సందర్భంగా కోడెల మాట్లాడారు.

వైద్యరంగంలో జరుగుతున్న పరిణామాలు, నూతన ఆవిష్కరణలపై వైద్యులు ఎప్పటికప్పుడు అప్ డేట్ కావాలని సూచించారు. వైద్య పరికరాలు, చికిత్సకు ఎంత ఖర్చయినా, పేదలకు ఉచితంగా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. 

Andhra Pradesh
Telugudesam
Balakrishna
nandamuri
kodela
basavatarakam hospital
  • Loading...

More Telugu News