Andhra Pradesh: ఏలూరులో టీడీపీ నేత బడేటి బుజ్జి అనుచరుల వీరంగం.. ప్లెక్సీలు తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బందితో గొడవ!

  • ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో ఘటన
  • మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ప్లెక్సీలను తొలగించిన సిబ్బంది
  • ఇరువర్గాలను శాంతింపజేసిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఈరోజు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పట్టణంలో ఈరోజు మున్సిపల్ సిబ్బంది టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఏర్పాటుచేసిన ప్లెక్సీలను తొలగించడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, బుజ్జి అనుచరులు అక్కడకు చేరుకున్నారు. టీడీపీ ప్లెక్సీల తొలగింపును అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బందికి, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం ఇరువర్గాలతో చర్చించి సమస్యను పరిష్కరించారు.

Andhra Pradesh
West Godavari District
ELURU
BADETI BUJJI
muncipal staff
Plexies
flexies
removing
  • Loading...

More Telugu News