Andhra Pradesh: కడప జిల్లాలోని గిరిజన హాస్టల్ లో కలుషిత ఆహారం సరఫరా.. 60 మంది విద్యార్థులకు అస్వస్థత!

  • ఆహారం కలుషితం కావడంతో ఆస్పత్రిపాలైన విద్యార్థులు
  • విద్యార్థులకు చికిత్స అందజేస్తున్న వైద్యులు
  • ఇంకా స్పందించని అధికారులు, ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కడప జిల్లాలో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని రాయచోటి గిరిజన వసతి గృహంలో ఈరోజు  అల్పాహారం తిన్న 60 మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్లారు. అనంతరం కొద్దిసేపటికే వీరంతా అస్వస్థతకు లోనయ్యారు. దీంతో పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు వీరిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వెంటనే చికిత్స ప్రారంభించిన వైద్యులు విద్యార్థులకు సెలైన్లు ఎక్కించారు. ఈ విషయమై డాక్టర్లు మాట్లాడుతూ.. కలుషిత ఆహారం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం స్థిరంగా ఉందనీ, ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై ఇటు జిల్లా అధికారులు, అటు ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదు.

Andhra Pradesh
YSRCP
Kadapa District
tribal welfare hostel
60 students sick
ill
  • Loading...

More Telugu News