GodavariUS: ప్రెస్ నోట్: ఈ వారాంతంలో జెర్సీ నగరం, న్యూజెర్సీలోకి అడుగిడనున్న గోదావరి
ప్రెస్ నోట్: “గోదావరి” విశ్వవ్యాప్తంగా దక్షిణ భారతీయ రుచులకు సుప్రసిద్ధమైన బ్రాండ్‌గా నిలిచిన సంస్థ జెర్సీ సిటీ, న్యూజెర్సీలో తన అధునాతన కేంద్రాన్ని ప్రారంభిస్తోంది. నెవార్క్ అవేలో ఉన్న ప్రముఖ ఇండియన్ స్ట్రీట్‌లో ప్రస్తుతం ఉన్న పారడైజ్ లోకేష్‌న్ స్థానంలో ఈ నూతన రెస్టారెంట్ అందుబాటులోకి రానుంది.
జెర్సీ సిటీలోని ఇండియన్ స్ట్రీట్ ‘లిటిల్ ఇండియా’గా పేరొందింది. అమెరికన్లందరి చూపును ఆకర్షించే ఈ ప్రాంతంలో తమ ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్క సంస్థ ఆకాంక్షిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధమైన ‘గోదావరి’ ఈ లిటిల్ ఇండియా(Indian restaurants in Little India, New Jersey) కేంద్రంగా ఆతిథులకు ఆకర్షణీయమైన రుచులు అందించనుంది.
గోదావరి బ్రాండ్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు మొట్టమొదటి సారిగా పనిదినాల్లో “భోజనం” కాన్సెప్ట్‌ను గోదావరి ఇక్కడి నుంచే ప్రవేశపెడుతోంది. వారాంతాల్లో ”రాయలగారి భోజనం” (అన్‌లిమిటెడ్ భోజనం) మరియు తమ సుప్రసిద్ధమైన ‘లంచ్ బఫెట్లు’ సైతం యథావిధంగా అతిథుల కోసం సిద్ధంగా ఉంటాయి.
“అతిథుల నోరూరించే మెనూతో మేం జెర్సీ సిటీలో అడుగిడుతున్నాం. 15 రకాలైన బిర్యానీలు మరియు 35 వెరైటీల దోశాలు (Biryanis and Dosa Varieties) దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టనున్నాం. ప్రపంచవ్యాప్తంగా విచ్చేసే సందర్శకులను దృష్టిలో ఉంచుకొని తెల్లవారుజామున 2 గంటల వరకు సైతం మా సేవలను అందుబాటులో ఉంచేందుకు మేం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం” అని ఈ రెస్టారెంట్లో కార్యాచరణలో గత కొద్దికాలంగా సేవలు అందిస్తున్న మురళి గోలి మరియు నరేష్ కుమార్ వెల్లడించారు.
“సుదీర్ఘకాలంగా నిరీక్షణలో ఉన్న గోదావరి ఎట్టకేలకు ఇండియన్ స్ట్రీట్‌లో ప్రారంభం కానున్నందుకు ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్కంఠగా ఉన్నారు (Indian restaurants in New Jersey). అనేకమంది ఇప్పటికే మా రెస్టారెంట్ సమీపంలో ఆగి మా సేవలు ప్రారంభం అయ్యాయా అని అడిగి తెలుసుకుంటున్నారు. ఇది మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తోంది” అని పేర్కొన్నారు.
“టీం” గోదావరి అత్యంత ప్రణాళికబద్దంగా దూకుడుతో ప్రపంచవ్యాప్తంగా తన సేవలను విభిన్నమైన బ్రాండ్లు అయిన “వాంగ” వంటి వాటితో కలుపుకొని విస్తరిస్తోంది. సుప్రసిద్దమైన బ్రాండ్ ద్వారా ప్రామాణికమైన దక్షిణ భారతీయ రుచులు లభ్యం కాని పరిస్థితి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా గోదావరి విస్తరిస్తూ నోరూరించే సమగ్రమైన మెనూతో ఫుడ్ ఇండస్ట్రీలో చెరగని ముద్రను వేసుకుంటోంది.
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా గోదావరి సేవలు విస్తరించాలని భావించే వారు తమను అత్యంత సులభంగా ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని “టీం” గోదావరి తెలిపింది. ఈ మెయిల్ అడ్రస్: franchise@godavarius.com.
రండి, ఈ వారాంతంలో జెర్సీ సిటీకి విచ్చేసి నోరూరించే రుచులను గోదావరిలో ఆరంగించండి.
మా చిరునామా:
గోదావరి జెర్సీ సిటీ
835 నెవార్క్ అవెన్యూ
జెర్సీ సిటీ, న్యూజెర్సీ 07306
సంప్రదించండి:
నరేష్ కుమార్
973-493-5880
సదామీసేవలో…..
Press release by: Indian Clicks, LLC