Kasu Mahesh Reddy: ఏపీ బడ్జెట్ ఆంధ్ర రూపు రేఖలను మార్చబోతోంది: కాసు మహేశ్ రెడ్డి

  • విద్యారంగానికి అనుకూలంగా బడ్జెట్
  • అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటుంది
  • 10 రోజుల్లోపే మెడికల్ కళాశాల కేటాయింపు

ఏపీ బడ్జెట్ ఆంధ్ర రూపు రేఖలను మార్చబోతోందని వైసీపీ గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన ఓ ఛానల్‌తో మాట్లాడుతూ, రైతులు, పేదలతో పాటు విద్యారంగానికి అనుకూలంగా బడ్జెట్‌ను రూపొందించారని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలనూ ఆకట్టుకునేలా బడ్జెట్ రూపొందించారని మహేశ్ తెలిపారు.

తమ ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజీ కేటాయించాలని సీఎం జగన్‌ను అడిగిన 10 రోజుల లోపే బడ్జెట్‌లో పెట్టి ప్రకటించడం విశేషమన్నారు. గురజాల చాలా వెనుకబడిన ప్రాంతమని, తమకు మెడికల్ కళాశాల కేటాయించిన జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన హామీల అమలుకే కాకుండా, సామాజికంగానూ అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మహేశ్ రెడ్డి కొనియాడారు. 

Kasu Mahesh Reddy
Jagan
Gurajala
Medical College
Budget
  • Loading...

More Telugu News