Gowtham Savang: పులివెందుల కాల్‌మనీ వ్యాపారుల బెదిరింపులకు తాళలేక మాజీ ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం

  • ఏపీలో సంచలనం సృష్టించిన కాల్‌మనీ వ్యవహారం
  • కాల్‌మనీ రాకెట్‌పై ఉక్కుపాదం మోపుతామన్న డీజీపీ
  • రక్షణ కోసం ఎస్పీని ఆశ్రయించిన కుటుంబ సభ్యులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాల్ మనీ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల ఏపీ డీజీపీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్.. ప్రెస్‌మీట్ పెట్టి మరీ కాల్‌మనీ రాకెట్‌పై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కాల్‌మనీ వ్యవహారం కాస్త సద్దుమణిగింది అనుకుంటుండగానే, తాజాగా పులివెందుల కాల్‌మనీ వ్యాపారుల బెదిరింపులు భరించలేక కదిరి మాజీ ఎమ్మెల్యే జొన్న రామయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఒక్కసారిగా ఏపీలో కలకలం రేగింది. తమకు రక్షణ కల్పించాలని రామయ్య కుటుంబ సభ్యులు ఎస్పీని ఆశ్రయించారు.

Gowtham Savang
Call Money
AP DGP
Jonna Ramaiah
Suicide Attempt
  • Loading...

More Telugu News