Parliament: పార్లమెంటు ఆవరణలో ఆసక్తికర సన్నివేశం.. ఫుట్‌బాల్ ఆడిన ఎంపీ

  • ఫుట్‌బాల్ ఆడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన ఎంపీ
  • గతంలో కెప్టెన్‌గా సేవలందించిన ప్రసన్ బెనర్జీ
  • అంతర్జాతీయ స్థాయిలో జట్టు రాణిస్తుందని ఆశాభావం

నేడు పార్లమెంటు ఆవరణలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రస్తుతం పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు హాజరైన ఓ ఎంపీ పార్లమెంటు ఆవరణలో ఫుట్‌బాల్ ఆడటంతో అవాక్కవడం ఇతర సభ్యుల వంతైంది.  

హౌరా లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ప్రసన్ బెనర్జీ కాసేపు పార్లమెంటు ఆవరణలో ఫుడ్‌బాల్ ఆడి అందరి చూపును తనవైపు తిప్పుకున్నారు. గతంలో భారత ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా సేవలందించిన ప్రసన్ బెనర్జీ, ఆ క్రీడను ప్రోత్సహించేందుకే తాను పార్లమెంటు ఆవరణలో ఫుట్‌బాల్ ఆడానని మీడియాకు తెలిపారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో ఇండియా ఫుట్‌బాల్ జట్టు రాణిస్తుందని ఆయన పేర్కొన్నారు. 

Parliament
TMC
Prasan Benerji
Foot Ball
International Level
  • Loading...

More Telugu News