MS Dhoni: ధోనీకి లతా మంగేష్కర్ విన్నపం

  • నీవు రిటైర్ కావాలనుకుంటున్నావనే వార్తలు వింటున్నా
  • దేశానికి నీ అవసరం చాలా ఉంది
  • రిటైర్మెంట్ గురించి ఆలోచించకు

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ కు గుడ్ బై చెప్పబోతున్నాడనే వార్తలు క్రికెట్ అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ధోనీ మరింత కాలం కొనసాగాలని ఇప్పటికే ఎందరో మాజీ క్రికెటర్లు, సెలబ్రిటీలు అభిప్రాయపడ్డారు. తాజాగా ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కూడా ఇదే అంశంపై స్పందించారు.

'హలో ధోనీ, నీవు రిటైర్ కావాలనుకుంటున్నావనే విషయాన్ని వింటున్నా. దయచేసి ఆ దిశగా ఆలోచించకు. నీ ఆట మన దేశానికి ఎంతో అవసరం. రిటైర్మెంట్ గురించి ఆలోచించవద్దని నేను వ్యక్తిగతంగా కోరుతున్నా' అంటూ లతా మంగేష్కర్ ట్వీట్ చేశారు.
మరోవైపు, ధోనీ రిటైర్మెంట్ గురించి భారీ ఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ... ఆయన నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

MS Dhoni
Lata Mangeshkar
Bollywood
  • Loading...

More Telugu News