Andhra Pradesh: చంద్రబాబును సీఎంగా ఉండగా వెళ్లి కలిశాం.. నిధులు ఇవ్వను పో అని కరాఖండిగా చెప్పేశారు!: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

  • నేను చంద్రబాబును కలవను అని చెప్పా
  • కానీ జగన్ నా ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలను పంపారు
  • ఇప్పుడు సీఎం జగన్ కు బాబు ధన్యవాదాలు తెలిపితే సంతోషిస్తా

ఏపీ సీఎం జగన్ గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తాను వైసీపీ ప్రతినిధులతో కలిసి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకున్నానని ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ‘‘వెళ్లి చంద్రబాబును కలువు అని మా నేత జగన్ చెప్పారు. అప్పుడు నేను.. అయ్యా.. నేనుపోను చంద్రబాబు దగ్గరకి. ఆయన్ను కలిసి 40 ఏండ్లు అయింది. ఇప్పుడు నన్నెందుకు పంపిస్తావు? అని అడిగా. దీనికి జగన్ స్పందిస్తూ.. లేదు. నీ ఆధ్వర్యంలోనే శాసన సభ్యులంతా పోవాలని అని చెప్పారు.

దీంతో సీఎంను కలిసి.. గతంలో వైఎస్ ప్రతీ ఎమ్మెల్యేకు రూ.కోటి ఇచ్చేవారు. నువ్వు కూడా ఓ టర్మ్ లో ఇచ్చావు. ఇప్పుడు కూడా ఇవ్వాలని అడిగాం. దీంతో 'పరిస్థితులు మారాయి. ఈసారి నేను ఇవ్వను' అని కరాఖండిగా చెప్పారు. ఇప్పుడు సీఎం జగన్ ప్రతీఒక్కరికీ రూ.కోటి ఇస్తామని ప్రకటించారు కాబట్టి చంద్రబాబు జగన్ మాటలకు మనసారా ధన్యవాదాలు తెలిపితే సంతోషిస్తా’’ అని పెద్దిరెడ్డి అన్నారు. దీంతో వైసీపీ సభ్యులంతా బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News