Andhra Pradesh: ఏంది నాని.. నల్లబడ్డావ్?.. నీకూ సన్నబియ్యం బస్తా పంపిస్తా!: అచ్చెన్నాయుడు- కొడాలి నాని మధ్య సరదా సంభాషణ

  • ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సరదా ఘటన
  • టీడీపీ నేతల్లా రెస్ట్ తీసుకోవడం లేదన్న మంత్రి నాని
  • సన్నబియ్యం సంగతి తేలుస్తామన్న అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏపీ పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి కొడాలి నాని, టీడీపీ నేత అచ్చెన్నాయుడు మధ్య సరదా సంభాషణ నడిచింది.అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు కొడాలి నాని, అచ్చెన్నాయుడు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ..‘ఏంటి నాని.. నల్లబడ్డావ్?’ అని అడిగారు. దీంతో కొడాలి నాని స్పందిస్తూ..‘జనంతో తిరుగుతున్నాం కదా. మీలా రెస్ట్ లో లేం అందుకే నల్లబడ్డా’ అని వ్యంగ్యంగా జవాబిచ్చారు.

దీంతో అచ్చెన్నాయుడు ‘మీరు రేషన్ లో ఇస్తామంటున్న సన్నబియ్యం సంగతి తేలుస్తాం’ అని ఉడికించారు. వెంటనే కొడాలి నాని స్పందిస్తూ..‘నువ్వు ఏమీ తేల్చలేవు. రేషన్ లో సన్నబియ్యం ఇచ్చి తీరుతాం. అవసరమైతే నీకూ సన్నబియ్యం బస్తా ఒకటి పంపుతా’ అని చెప్పడంతో అచ్చెన్నాయుడు నవ్వేశారు.

Andhra Pradesh
Telugudesam
YSRCP
Kodali Nani
achennaidu
  • Loading...

More Telugu News