Sammohanam: ‘సమ్మోహనం’ సినిమాలో నటించిన అమిత్ పురోహిత్ మృతి

  • చాలా స్నేహంగా ఉండేవాడని పేర్కొన్న సుధీర్‌బాబు
  • ప్రతి షాట్‌కూ 100 శాతం న్యాయం చేసే వాడని వెల్లడి
  • మనల్ని విడిచి వెళ్లిపోయాడంటూ సుధీర్‌బాబు ఆవేదన

‘సమ్మోహనం’ చిత్రంలో కథానాయిక అదితీరావు హైదరీకి మాజీ ప్రియుడిగా నటించిన అమిత్ పురోహిత్ మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆ చిత్ర కథానాయకుడు సుధీర్‌బాబు ట్విట్టర్ వేదికగా తెలపడమే కాకుండా చాలా ఆవేదన వ్యక్తం చేశాడు. అమిత్ మరణం తనను ఎంతగానో బాధించిందని తెలిపాడు.

‘సమ్మోహనం’ చిత్రంలో సమీరా(అదితి)కు మాజీ ప్రియుడు అమిత్ మల్హోత్రా పాత్రలో నటించాడని, చాలా స్నేహశీలి అని సుధీర్‌బాబు పేర్కొన్నాడు. మంచి నైపుణ్యమున్న మరో యువ నటుడు మనల్ని విడిచి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు.  ప్రతి షాట్‌కూ 100 శాతం న్యాయం చేసేవాడని సుధీర్ బాబు తెలిపాడు. అమిత్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నాడు. అయితే అమిత్ ఎలా మృతి చెందాడనే విషయం మాత్రం తెలియరాలేదు.

Sammohanam
Sudheer babu
Amith Purohith
Adithirao Hydari
Twitter
  • Loading...

More Telugu News