assembly: 14 రోజులపాటు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

  • రేపు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం...30న ముగింపు
  • 12న 11 గంటలకు బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి
  • అదే రోజు వ్యవసాయ బడ్జెట్‌ కూడా

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాలు 14 రోజులపాటు (పనిదినాలు) జరగనున్నాయి. ఈరోజు అమరావతిలో స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి ప్రారంభంకానున్న సమావేశాలు సెలవులతో కలిసి ఈనెల 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. 12వ తేదీ ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసన సభలో బడ్జెట్‌ ప్రవేశపెడతారు. అదేరోజు మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ను సభ ముందుంచనున్నారు. బీఏసీ సమావేశానికి ముఖ్యమంత్రి జగన్‌తోపాటు టీడీపీ తరపున అచ్చెన్నాయుడు హాజరయ్యారు.

assembly
14 days
BAC
upto 30th jully
  • Loading...

More Telugu News