AP Assembly: ఏపీ అసెంబ్లీలో బీఏసీ సమావేశం ప్రారంభం

  • రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
  • బీఏసీ సమావేశానికి హాజరైన జగన్
  • టీడీపీ తరపున అచ్చెన్నాయుడు హాజరు

రేపు ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం అసెంబ్లీలో బీఏసీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి జగన్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మంత్రి కన్నబాబు, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. టీడీపీ తరపున అచ్చెన్నాయుడు సమావేశానికి వచ్చారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే విషయంపై చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల షార్ట్ డిస్కషన్ లో కరువుపై చర్చించాలని టీడీపీ కోరనుంది.

AP Assembly
Budget
BAC
Jagan
Achennaidu
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News