Andhra Pradesh: చీటింగ్ కేసులు.. మోసాలు.. ఏపీలో యువ కాంగ్రెస్ నేత అట్లూరి విజయ్ అరెస్ట్!

  • గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఘటన
  • నిరుద్యోగుల నుంచి భారీగా నగదు వసూలు చేసిన విజయ్
  • ఏపీలో పలు చీటింగ్ కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్ యువ కాంగ్రెస్ నేత అట్లూరి విజయ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి పలువురు నిరుద్యోగుల నుంచి విజయ్ భారీగా నగదును గుంజినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అంతేకాకుండా విజయ్ కుమార్ పై గతంలోనూ పలు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో దొంగ నంబర్ ప్లేట్లు ఉన్న కారులో తిరుగుతున్న విజయ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలిస్తామని పేర్కొన్నారు.

Andhra Pradesh
cheating cases
Congress
  • Loading...

More Telugu News