Allu Arjun: బన్నీ సరసన నాయికగా ఛాన్స్ కొట్టేసిన రాశి ఖన్నా

  • రాశి ఖన్నా చేతిలో రెండు తెలుగు సినిమాలు
  •  వేణు శ్రీరామ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాశి ఖన్నా
  • తమిళంలోను వరుస అవకాశాలు

తెలుగు తెరపై అందాల కథానాయికగా మంచి మార్కులు కొట్టేసిన రాశి ఖన్నా, నిదానమే ప్రధానం అన్నట్టుగా ఒక్కో అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ వెళుతోంది. ప్రస్తుతం తెలుగులో 'వెంకీమామ' .. 'ప్రతిరోజూ పండగే' సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె బన్నీ జోడీగా ఎంపిక అయిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

 ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్' అనే మూవీ చేయనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా రాశి ఖన్నాను తీసుకున్నారని తెలుస్తోంది. అదే నిజమైతే రాశి ఖన్నా కెరియర్ మరింత ఊపందుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తమిళంలోను ఆమె విజయ్ సేతుపతి .. విజయ్ సరసన అవకాశాలను దక్కించుకోవడం విశేషం. 

Allu Arjun
Rasi Khanna
  • Loading...

More Telugu News