Ravichandran Ashwin: కౌంటీలో లండన్ పిచ్ లపై తన స్పిన్ తో ఇరగదీస్తున్న అశ్విన్!

  • కౌంటీ క్రికెట్ ఆడుతున్న అశ్విన్
  • నాటింగ్ హామ్ షైర్ తరఫున బరిలోకి
  • 8 వికెట్లు తీసిన అశ్విన్

భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించుకోవడంలో విఫలమైన రవిచంద్రన్ అశ్విన్, లండన్ పిచ్ లపై సత్తా చూపించడం ఏంటని అనుకుంటున్నారా? టీమిండియాలో స్థానం దక్కకపోయినా, కౌంటీ క్రికెట్ ఆడేందుకు అనుమతి పొంది, ప్రస్తుతం నాటింగ్ హామ్ షైర్ తరఫున ఆడుతున్న అశ్విన్, సొమర్‌ సెట్‌ తో జరిగిన మ్యాచ్‌ లో ఏకంగా ఐదు వికెట్లు తీశాడు. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ అశ్విన్ నిప్పులు చెరిగే బంతులేశాడు.

మరోవైపు బ్యాటింగ్ లోనూ రాణించాడు. టౌంటన్ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగగా, రెండు ఇన్నింగ్స్‌ లలో అశ్విన్ ఎనిమిది వికెట్లు తీయడం గమనార్హం. రెండో ఇన్నింగ్స్ లో 41 పరుగులతో జట్టులో అత్యధిక స్కోరర్ గానూ నిలిచాడు. అయితే, ఇతర ఆటగాళ్లు అంతగా రాణించని కారణంగా ఈ మ్యాచ్‌ లో నాటింగ్ హామ్ షైర్ ఓడిపోయింది.

Ravichandran Ashwin
Spin
Notinghamshire
London
Cricket
  • Loading...

More Telugu News