Donald Trump: ఇక సహించబోను... ఇండియాకు ట్రంప్ తాజా వార్నింగ్!
- పన్నులు వేసి భారత్ లాభాలను పొందుతోంది
- ఇది అంగీకారయోగ్యం కాదు
- మరోసారి నోరు పారేసుకున్న ట్రంప్
ఇండియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. ఇటీవల జపాన్ లో జరిగిన జీ-20 సమావేశంలో ఇరు దేశాల మధ్యా పెరిగిన వాణిజ్య పన్నులపై చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని నిర్ణయించుకున్నట్టు చెప్పిన ట్రంప్, తాజాగా మరో వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. అమెరికా తయారు చేసే ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటూ వాటిపై భారీగా పన్నులు విధిస్తున్న భారత్ బాగా లాభాలను పొందుతోందని, ఇకపై దీన్ని సహించేది లేదని హెచ్చరించారు.
"అమెరికా ఉత్పత్తుల మీద అధిక టారిఫ్ లను విధించి, ఇండియా ఎప్పటి నుంచో లాభపడుతోంది. ఇక ముందు ఇది అంగీకారయోగ్యం కాదు" అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. త్వరలోనే ఇండియా, యూఎస్ మధ్య వాణిజ్య సమస్యల పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.