Pakistan: పాకిస్థాన్ న్యూస్ యాంకర్‌ను కాల్చి చంపిన దుండగుడు

  • వ్యక్తిగత కక్షలతోనే హత్య
  • కాల్పుల అనంతరం తనను తాను కాల్చుకున్న నిందితుడు
  • పరిస్థితి విషమంగా ఉందన్న పోలీసులు

పాకిస్థాన్‌లోని ఓ న్యూస్ యాంకర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఓ కేఫ్ బయట ఆయనను దుండగుడు కాల్చి చంపాడు. బోల్ న్యూస్ అనే చానల్‌లో మురీద్ అబ్బాస్ న్యూస్ యాంకర్. ఖయబన్-ఇ-బుఖారీ ప్రాంతంలో కేఫ్ వద్ద కారులో ఉన్న అబ్బాస్‌పై  అతీఫ్ జమాన్ అనే వ్యక్తి ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన అబ్బాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వ్యక్తిగత కక్షలతోనే ఈ హత్య జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన అబ్బాస్ స్నేహితుడు ఖిజార్ హయత్ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, కాల్పుల అనంతరం ఆత్మహత్యకు యత్నించిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. చాతీలో కాల్చుకోవడంతో అతడి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. 

Pakistan
News anchor
shot dead
Bol news
  • Loading...

More Telugu News