Nityanand Roy: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదంటూ మరోసారి స్పష్టం చేసిన కేంద్రం

  • వైసీపీ ఎంపీ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం 
  • ప్రత్యేక సాయం మాత్రమే చేస్తామని స్పష్టం
  • ఏపీ, తెలంగాణల మధ్య సమస్యలపై దృష్టి సారించాం

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రం మరోసారి తేల్చి చెప్పింది. కేంద్రహోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ మేరకు లోక్‌సభలో నేడు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై లోక్‌సభలో వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అడిగిన ప్రశ్నకు నిత్యానందరాయ్ స్పందించారు.

ప్రత్యేక సాయం మాత్రమే చేస్తామని ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం తాము ఏపీ, తెలంగాణల మధ్య సమస్యలపై దృష్టి సారించామని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తామన్నారు. హోదా అంశం 14వ ఆర్థిక సంఘం సిఫార్సులతో పూర్తిగా మరుగున పడిందని నిత్యానంద్ స్పష్టం చేశారు. ఇటీవల కేంద్ర రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Nityanand Roy
Balli Durga Prasad
Special Status
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News