T congress: కోమటిరెడ్డి ఆరోపణలపై ఆధారాలు చూపాలి, లేనిపక్షంలో ముక్కు నేలకు రాయాలి: టీఆర్ఎస్ నేత వివేకానందగౌడ్

  • శంభీపూర్ రాజుపై భూ కబ్జాల ఆరోపణ
  • ఈ ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకోవాలి
  • లేనిపక్షంలో పరువునష్టం దావా వేస్తాం

కేటీఆర్ అండతో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఆరోపణలపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ స్పందిస్తూ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. శంభీపూర్ రాజు తన సొంత ఊర్లో ఇల్లు నిర్మించుకుంటే కోమటిరెడ్డికి ఎందుకు బాధ? అని ప్రశ్నించారు.

శంభీపూర్ రాజుపై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో ఆయనపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. కోమటిరెడ్డి చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే నిరూపించాలని, లేనిపక్షంలో ముక్కు నేలకు రాయాలంటూ కోమటిరెడ్డిపై ధ్వజమెత్తారు. కోమటిరెడ్డి తన అసత్య ఆరోపణలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

T congress
komati reddy
mp
mlc
shambipur raj
  • Loading...

More Telugu News