Narendra Modi: మీ నియోజకవర్గాల్లో 150కి.మీ మేర పాదయాత్ర చేపట్టండి: ఎంపీలకు మోదీ పిలుపు

  • మహాత్ముని 150వ జయంతి సందర్భంగా పాదయాత్ర
  • పటేల్ జయంతి వరకూ కొనసాగించాలని సూచన
  • పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వెల్లడి

ప్రధాని మోదీ దాదాపు నెల రోజుల పాటు పాదయాత్ర చేపట్టనున్నారు. ఆయనే కాదు, తమ పార్టీ ఎంపీలకు కూడా తమ నియోజకవర్గాల్లో 150 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టాలని సూచించారు. నేడు ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో పాల్గొన్న మోదీ, మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని పాదయాత్ర చేపట్టాలని లోక్‌సభ సభ్యులకు పిలుపునిచ్చారు.

అక్టోబర్ 2 నుంచి ఈ పాదయాత్రను ప్రారంభించి.. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31 వరకూ కొనసాగించాలని పార్లమెంటరీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ప్రహ్లాద్ జోషీ లోక్‌సభ సభ్యులకు సూచించారు. పాదయాత్ర కొనసాగిస్తూనే ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో రాజ్యసభ సభ్యులు పాదయాత్ర చేయాలని సూచించారు.

Narendra Modi
Delhi
BJP
Mahatma Gandhi
Sardar Vallabhai Patel
Prahlad Joshi
  • Loading...

More Telugu News