Rohit Sharma: రోహిత్ శర్మను అడ్డుకునేవారు ఎవరున్నారు?: మైఖేల్ క్లార్క్

  • ఇండియా విజయాల వెనుక రోహిత్ అద్భుత ప్రదర్శన దాగుంది
  • రోహిత్ ను అడ్డుకునే బౌలర్ లేడు
  • న్యూజిలాండ్ ను తక్కువగా అంచనా వేయవద్దు

ప్రపంచకప్ లో టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఒకే ప్రపంచకప్ లో ఐదు సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ సందర్భంగా రోహిత్ పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ప్రశంసలు కురిపించాడు. భారత విజయాల వెనుక రోహిత్ అద్భుత ప్రదర్శన దాగుందని కితాబిచ్చాడు. ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్ ను అడ్డుకునే బౌలర్ ఎవరున్నారని ప్రశ్నించాడు. రోహిత్ ను నిలువరించేవారు ఎవరూ లేరని చెప్పాడు.

ప్రపంచకప్ లో టీమిండియా గొప్పగా ఆడుతున్నప్పటికీ... న్యూజిలాండ్ ను తక్కువగా అంచనా వేయవద్దని క్లార్క్ చెప్పాడు. అయితే, వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిపోవడంతో ఆ జట్టులో ఆత్మవిశ్వాసం లోపించిందని అన్నాడు.

Rohit Sharma
Michael Clarke
Team India
Australia
New Zealand
World Cup
  • Loading...

More Telugu News