World Cup: ఇండియా-న్యూజిలాండ్ సెమీస్... ఈరోజు ఏయే సమయంలో వర్షం పడే అవకాశం ఉందంటే..!

  • ఓల్డ్ ట్రాఫోర్డ్ లో నేడు తొలి సెమీస్
  • టాస్ వేసే సమయంలో కారు మబ్బులు ఉంటాయి
  • సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు వర్షం కురిసే అవకాశం

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న క్రికెట్ ప్రపంచకప్ చివరి అంకానికి చేరుకుంది. ఓల్డ్ ట్రాఫోర్డ్ లో ఈరోజు జరగనున్న తొలి సెమీఫైనల్స్ లో టీమిండియాను న్యూజిలాండ్ ఢీకొనబోతోంది. రెండు సార్లు ప్రపంచకప్ విజేత అయిన టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈనాటి మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశం ఉంది.

అక్యూవెదర్ అంచనాలను బట్టి, భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 11 నుంచి 12 గంటల మధ్య జల్లులు పడతాయి. కాసేపటి తర్వాత ఈ జల్లులు ఆగిపోతాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4 గంటల వరకు కారుమబ్బులు కమ్ముకునే అవకాశం ఉంది. టాస్ వేసే (2.30 గంటలు) సమయంలో మేఘాలు కమ్ముకుని ఉంటాయి. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని అక్యూవెదర్ తెలిపింది. ఆ తర్వాత వర్షం ఆటంకం కలిగించకపోవచ్చని పేర్కొంది. అయితే మ్యాచ్ ఆసాంతం ఆకాశం మేఘావృతమై ఉంటుంది.

  • Loading...

More Telugu News