Telugudesam: కోడెల శివప్రసాద్ తనయుడు శివరామకృష్ణపై మరో కేసు

  • జడ్పీలో ఉద్యోగం ఇప్పిస్తానని లక్షల వసూలు
  • డబ్బులు వెనక్కి ఇవ్వమన్నందుకు బెదిరింపులు
  • కులం పేరుతో బెదిరింపులు

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు డాక్టర్ శివరామకృష్ణపై మరో కేసు నమోదైంది. నరసరావుపేటకు చెందిన ఎమ్మార్పీఎస్ నాయకుడు కాల్వ రవి ఫిర్యాదు మేరకు శివరామకృష్ణతోపాటు ఆయన కార్యదర్శి ప్రసాదుపై మోసం, కుల దూషణ, బెదిరింపు నేరాల కింద కేసులు నమోదు చేసినట్టు రెండో పట్టణ పోలీసులు తెలిపారు.

పట్టణానికి చెందిన మద్దూరి నాగరాజు అనే వ్యక్తికి జిల్లా పరిషత్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని శివరామకృష్ణ ఐదు లక్షలు, ఆయన కార్యదర్శి ప్రసాదు రెండు లక్షల రూపాయలు తీసుకున్నట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రవి పేర్కొన్నారు. అయితే, ఉద్యోగం ఇప్పించడంలో విఫలమైనందున డబ్బులు వెనక్కి ఇవ్వమన్నా ఇవ్వలేదని ఆరోపించారు. అంతేకాక, కులం పేరుతో దూషించారని, బెదిరించారని ఆరోపించారు. రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Telugudesam
Kodela shiva prasad
shivarama krishna
Gujarat
  • Loading...

More Telugu News