Visakhapatnam District: విశాఖ జిల్లాలో బోల్తాపడిన ప్రైవేటు టూరిస్టు బస్సు.. ముగ్గురు మహిళల మృతి

  • బాధితులు కాకినాడ వాసులు
  • ఒడిశాలోని మజ్జి గౌరమ్మ దర్శనానికి వెళ్తుండగా ఘటన
  • తీవ్రంగా గాయపడిన 37 మంది

విశాఖపట్టణం జిల్లా పాడేరు మండలం వంట్లమామిడి ఘాట్ రోడ్డులో ప్రైవేటు టూరిస్టు బస్సు బోల్తా పడింది. నిన్న అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం అనకాపల్లిలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న నలుగురిని విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన సమయంలో వర్షం భారీగా పడుతుండడంతో సహాయక చర్యలకు దాదాపు మూడు గంటలపాటు ఆటంకం ఏర్పడింది. దీంతో క్షతగాత్రులు ఇబ్బంది పడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడకు చెందిన బాధితులు రాయ్‌గఢ్‌లోని మజ్జి గౌరమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Visakhapatnam District
paderu
tourist bus
Road Accident
  • Loading...

More Telugu News