: ఇంతకీ ... ఆరుషిని చంపిందెవరు?


నోయిడాలో టీనేజర్ ఆరుషి చనిపోయి నేటికి ఐదేళ్ళు కావస్తోంది. అయినా, ఆమెను చంపిందెవరో ఇంతవరకు నిర్ధారణ కాలేదు. 2008లో సరిగ్గా ఇదే రోజు పోలీసులు నోయిడాలోని జలవాయు విహార్ నివాసానికి వెళ్ళినపుడు ఆరుషి శవమై పడి ఉంది. ఇదేదో హత్య కేసు, తేల్చేద్దాం అని భావించిన పోలీసులకు ఈ తర్వాత రోజు సవాల్ ఎదురైంది. అదే ఇంట్లో టెర్రస్ పై పనివాడు హేమరాజ్ మృతదేహం కనిపించింది. అప్పటిగ్గానీ అర్థంకాలేదు, పోలీసులకు ఇదేమీ అల్లాటప్పా కేసు కాదన్న విషయం. అప్పటినుంచి పలు మలుపులు తిరిగిన ఈ కేసు ఇంకా ఓ కొలిక్కిరాలేదు.

ఈ కేసును తొలుత నోయిడా పోలీసులు చేపట్టారు. ఆరుషి తండ్రి రాజేశ్ తల్వార్ ను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో అప్పటి ఐజీ గురుదర్శన్ మీడియాతో మాట్లాడుతూ.. ఆరుషి, హేమరాజ్ 'సన్నిహితం'గా ఉండడం చూసి ఆమె తండ్రే వారిద్దరినీ చంపి ఉంటాడని వ్యాఖ్యానించాడు. తత్ఫలితం.. ఆయన్ను బదిలీ చేశారు.

అప్పట్లో యూపీ సీఎంగా ఉన్న మాయావతి ఈ కేసును సీబీఐకి బదలాయించింది. వెంటనే విచారణ ఆరంభించిన సీబీఐ తల్వార్ ఇంట్లో ముగ్గురు పనిమనుషులను అరెస్టు చేయగా, తదనంతరం వారు బెయిల్ పై విడుదలయ్యారు. అదే సమయంలో, ఆరుషి మర్మావయాలకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికలు తారుమారు అయ్యాయని వార్తలొచ్చాయి. దీంతో, సీబీఐకి చెందిన మరో బృందం విచారణ కొనసాగించింది.

తల్వార్ దంపతులకు నార్కో ఎనాలసిస్ పరీక్షలు నిర్వహించి, వారే ఈ హత్యలు చేశారని కోర్టుకు విన్నవించింది. దీంతో, వారిద్దరినీ నిందితులుగా కోర్టు కూడా పరిగణించింది. అప్పటినుంచి వారిద్దరూ విచారణను ఎదుర్కొంటూనే ఉన్నారు.

  • Loading...

More Telugu News