Naga Chaitanya: ఇంతకాలం దాచి ఉంచిన సీక్రెట్‌ టాటూను బయటపెట్టిన సమంత

  • అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తున్నా
  • దాచి పెట్టిన టాటూ చివరికి బయట పడింది
  • నా భర్త నాగ చైతన్యే నా ప్రపంచం

ఇంతకాలం దాచి ఉంచిన ఓ సీక్రెట్‌ను అగ్ర కథానాయిక సమంత తాజాగా బయట పెట్టేసింది. నిన్న నిర్వహించిన ‘ఓ బేబీ’ థాంక్స్‌ మీట్‌లో పాల్గొన్న సమంత తెలుపు రంగు దుస్తుల్లో హంసలా మెరిసిపోయింది. ఈ సందర్భంగా ఫోటో షూట్‌లో పాల్గొన్న సామ్ తన శరీరంపై ఉన్న సీక్రెట్ టాటూని బయట పెట్టేసింది.

తన భర్త అక్కినేని నాగచైతన్య పేరును సామ్ తన శరీరంపై కుడి వైపు పక్కటెముకల వద్ద టాటూగా వేయించుకుంది. ఫోటో షూట్‌లో భాగంగా సామ్ తన టాటూని బయట పెట్టింది. ఆ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సామ్, అద్భుతమైన జీవితాన్ని తాను అనుభవిస్తున్నానని పేర్కొంది. తాను ఇప్పటి వరకూ దాచి పెట్టిన ఒకే ఒక్క టాటూ చివరికి బయట పడిందని తెలిపింది. నా భర్త నాగ చైతన్యే నా ప్రపంచం అని సామ్ పేర్కొంది.    

Naga Chaitanya
Samantha
Tatoo
Photo Shoot
O Baby
Instagram
  • Loading...

More Telugu News