Businessman: రాంప్రసాద్ తన మనుషులతో మా ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టేవాడు: నిందితుడు శ్యామ్ భార్య వరలక్ష్మి

  • రాంప్రసాద్ కారణంగా మేము విసిగిపోయాం
  • రాంప్రసాద్ వల్ల నా భర్త కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు
  • కోగంటి సత్యం మా కుటుంబాన్ని ఆదుకుంటున్నారు

వ్యాపారి రాంప్రసాద్ ను తానే హత్య చేశానని నిందితుడు శ్యామ్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్యామ్ భార్య వరలక్ష్మిని మీడియా కలిసింది. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ, రాంప్రసాద్ ను తన భర్త హత్య చేసిన విషయం తనకు తెలియదని చెప్పారు. అయితే, రాంప్రసాద్ వల్ల తాము బాగా విసిగిపోయామని, ఆయన పెట్టిన కేసుల వల్ల తన భర్త కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. రాత్రి సమయాల్లో తమ ఇంటికి రాంప్రసాద్ తన మనుషులతో వచ్చి ఇబ్బంది పెట్టేవాడని ఆరోపించారు. తనను, తన పిల్లలను ఇబ్బందులకు గురి చేశాడని, తమ ఇంట్లో నుంచి రూ.8 లక్షలు పట్టుకుపోయాడని రాంప్రసాద్ పై వరలక్ష్మి ఆరోపణలు చేశారు. ఈ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోగంటి సత్యం గురించి ఆమె ప్రస్తావిస్తూ, తమను అన్ని విధాలా ఆయన ఆదుకుంటున్నారని చెప్పారు. 

Businessman
Ramprasad
Shyam
Vara lakshmi
  • Loading...

More Telugu News