Yuvraj Singh: ఎవరూ చేయని విధంగా 'బాటిల్ క్యాప్ చాలెంజ్' పూర్తిచేసిన యువరాజ్ సింగ్

  • క్రికెట్ షాట్ తో బాటిల్ మూత గాల్లోకి లేపిన యువీ
  • లారా, ధావన్, గేల్, సచిన్ లకు సవాల్
  • వైరల్ అవుతున్న వీడియో

సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా 'బాటిల్ క్యాప్ చాలెంజ్' గురించే చర్చ జరుగుతోంది. అనేక రంగాలకు చెందిన ప్రముఖులు సైతం ఈ చాలెంజ్ లో పాల్గొంటుండడంతో దీనికి విశేష ప్రాచుర్యం లభిస్తోంది. తాజాగా, క్రికెట్ లెజెండ్ యువరాజ్ సింగ్ కూడా 'బాటిల్ క్యాప్ చాలెంజ్' పూర్తిచేశాడు. సాధారణంగా లెగ్ కిక్ తో బాటిల్ కున్న మూతను తీయాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా యువరాజ్ సింగ్ క్రికెట్ బ్యాట్ తో ఓ షాట్ కొట్టి బాటిల్ క్యాప్ చాలెంజ్ ను పూర్తిచేశాడు. దీనికి సంబంధించిన వీడియోని యువరాజ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశాడు.

యువీ ఓ టెన్నిస్ బంతిని షాట్ ఆడగానే, ఆ బంతి ఎదురుగా ఉన్న మంచినీళ్ల సీసాకు తగలడం, ఆ సీసా మూత గాల్లోకి లేవడం వీడియోలో చూడొచ్చు. అంతేకాకుండా, ఓ లెఫ్ట్ హ్యాండర్ గా ఇతర లెఫ్ట్ హ్యాండర్లకు సవాల్ విసురుతున్నానంటూ బ్రియాన్ లారా, శిఖర్ ధావన్, క్రిస్ గేల్, సచిన్ టెండూల్కర్ లను యువరాజ్ ఈ చాలెంజ్ కు నామినేట్ చేశాడు. సచిన్ ఆటలో కుడిచేతివాటమే అయినా స్వతహాగా లెఫ్ట్ హ్యాండర్. ఈ ఉద్దేశంతోనే సచిన్ కూడా నామినేట్ చేశాడీ డాషింగ్ ఆల్ రౌండర్.

Yuvraj Singh
Sachin Tendulkar
Dhawan
Gayle
Bottle Cap Challenge
  • Error fetching data: Network response was not ok

More Telugu News