Ys Rajasheker reddy: తెలంగాణ ప్రజలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుండిపోతారు: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి

  • వైఎస్ ఏ ప్రాంతానికి చెందినవారన్నది ముఖ్యం కాదు
  • పేదలకు మేలు చేశారా? లేదా? అన్నదే ముఖ్యం
  • పేదలకు మేలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుండిపోతారని, ‘104’, ‘108’ సేవలను, ఫీజు రీయింబర్స్ మెంట్ ప్రవేశపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. వైఎస్ ఏ ప్రాంతానికి చెందినవారన్నది ముఖ్యం కాదని, పేదలకు మేలు చేశారా? లేదా? అన్నదే ముఖ్యమని, వారికి మేలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు.

కాగా, ఈరోజు జగ్గారెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తల మధ్య తన పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకున్నారు. అభిమానులు తీసుకొచ్చిన కేక్ ను జగ్గారెడ్డి కట్ చేశారు. జగ్గారెడ్డికి పూలమాలలు వేసిన ఆయన అభిమానులు అభినందనలు తెలిపారు.

Ys Rajasheker reddy
sangareddy
mla
jaggareddy
  • Loading...

More Telugu News