Ranga Reddy District: రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి

  • శ్రీశైలం వెళ్లి వస్తుండగా ప్రమాదం
  • ఇన్నోవా వాహనాన్ని ఢీకొన్న లారీ
  • మట్టెవాడ హెడ్ కానిస్టేబుల్ మృతి
  • కారు డ్రైవర్ పరిస్థితి విషమం

కారు, లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం మేడిగడ్డ సమీపంలో జరిగింది. కుటుంబం మొత్తం శ్రీశైలం వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఎస్సై మల్లేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం, శ్రీశైలంలో స్వామి వారి దర్శనం చేసుకున్న వరంగల్ జిల్లా మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దుర్గాప్రసాద్ కుటుంబం తిరిగి పయనమయ్యారు.

వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు శ్రీశైలం - హైదరాబాద్ జాతీయ రహదారి పైకి రాగానే గ్రానైట్ లోడుతో వెళుతున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుర్గాప్రసాద్‌తో పాటు ఆయన కుమారుడు శాంతన్, బావ రాజు, మరొకరు అక్కడికక్కడే మృతి చెందాడు. దుర్గాప్రసాద్ భార్య విజయలక్ష్మిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. కారు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Ranga Reddy District
Srisailam
Durga Prasad
Vijaya Lakshmi
Shanthan
  • Loading...

More Telugu News