kumaraswamy: కుమారస్వామి సీఎం పదవికి రాజీనామా చేయాలి.. బీజేపీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం!: శోభా కరంద్లాజే

  • మేం కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టలేదు
  • అసెంబ్లీలో కుమారస్వామి మెజారిటీని కోల్పోయారు
  • కాబట్టి వెంటనే ఆయన రాజీనామా చేయాలి

బీజేపీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని కర్ణాటక బీజేపీ నేత శోభ కరంద్లాజే తెలిపారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను తాము ప్రలోభపెడుతున్నామన్న వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్-జేడీఎస్ అసమ్మతి నేతలతో తాము టచ్ లో లేమని చెప్పారు. అసెంబ్లీలో సీఎం కుమారస్వామి మెజారిటీ కోల్పోయారని ఆమె చెప్పారు. కాబట్టి కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి కుమారస్వామి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు కర్ణాటకలో తమ ప్రభుత్వం సాఫీగా కొనసాగుతుందనీ,  ప్రభుత్వ మనుగడకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని మంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. కాగా, తన మంత్రి పదవికి రాజీనామా చేశాక నగేశ్ ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లిపోయారు.

kumaraswamy
Karnataka
Congress
jds
BJP
Chief Minister
  • Loading...

More Telugu News