Andhra Pradesh: ఈ నెల 10 తర్వాత రాజధాని రైతుల విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటాం!: నారా లోకేశ్

  • రాజధానిపై సీఎం జగన్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు
  • మేం చేపట్టిన పనులపై సబ్ కమిటీ వేశారు
  • ఏసీ రూముల్లో ఉండి మాపై విమర్శలు చేస్తున్నారు
  • గుంటూరులో మీడియాతో ముచ్చటించిన నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సీఎం జగన్ ఇంతవరకూ ఎలాంటి స్పష్టత  ఇవ్వలేకపోయారని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పనులపై కేబినెట్ సబ్ కమిటీ వేశారని వ్యాఖ్యానించారు. కొందరు కమీషన్లు తీసుకునే నాయకులు ఏసీ రూముల్లో ఉండి తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో ఈరోజు మీడియాతో లోకేశ్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

ఏపీ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ఈ నెల 10 తర్వాత రాజధాని రైతుల విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతకుముందు ట్విట్టర్ లో లోకేశ్ స్పందిస్తూ.. సీఎం జగన్ అబద్ధాలు చెబుతున్నారనీ, అందుకు భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News